ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం : పాణ్యం మండల కేంద్రంలోఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
Panyam, Nandyal | Sep 16, 2025 పాణ్యం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల జడ్పీటీసీ, ఎంపీపీ, తహసీల్దార్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.