చిట్వేల్: అలుగు పారుతున్న ఎల్లమ్మరాజు చెరువు
చిట్వేల్ మండలంలోని ఎల్లమ్మరాజు చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండి అలుగు పారుతుంది. తుఫాను ప్రభావంతో గత నాలుగు రోజులుగా వెలుగొండల పరిసర ప్రాంతాలలో పడిన వర్షపు నీతితో గుండాలకోన ద్వారా చెరువుకు వరదనీరు చేరింది. దాదాపు 480 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువు కట్టలుగా దాటెంతగా నీటిమట్టం పెరగడంతో అలుగు ఉదృతంగా మారుతుంది చెరువు నిండిపోవడంతో ఈ సంవత్సరం కరువు ఆందోళన ఉండదని రైతులు సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు చెరువు పరిసరాలు రద్దీగా వచ్చి నీటిపారుదలను పరిశీలిస్తున్నారు.