నారాయణపేట్: జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన విజయదశమి వేడుకలు
జిల్లావ్యాప్తంగా శనివారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మరికల్ మండలం,సింగారం గ్రామాల్లోఈ వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వహించారు.విజయదశమిని పురస్కరించుకొని జమ్మిచెట్టు వద్ద ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వహకులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, భక్తులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.