జమ్మలమడుగు: ప్రొద్దుటూరు : ఈ వర్షపు నీటిలో రైతుల కన్నీళ్లు కలిసి ఉన్నాయి - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మెంథా తుఫాన్ వల్ల రాష్టంలో 20లక్షల ఎకరాలు పైగా పంట నష్టం జరిగిందని ఈ విపత్తు వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కు జరిగిన నష్టం చాలా దారుణం అని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు తుఫాన్లు వచ్చాయని ఇంతవరకు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఇవ్వలేదని రాచమల్లు ఆరోపించారు.