బాన్సువాడ: అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి; బాన్సువాడ సబ్ కలెక్టర్కు వినతిపతనాన్ని అందజేసిన విద్యార్థి సంఘాల నాయకులు
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల అనుమతులను రద్దు చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్కు విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఏఐపిఎస్ యు డి ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులు సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పిట్లం మండల కేంద్రంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరిట నడుపుతున్న స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఆ స్కూలుకు ఎలాంటి అనుమతులు లేవని వినీత్ పత్రంలో పేర్కొన్నారు.