హుజూరాబాద్: MLA పాడి కౌశిక్ రెడ్డికి సీజో ఫోర్నియా అనే వ్యాధి సోకింది ప్రెస్ మీట్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్
హుజురాబాద్: MLA కౌశిక్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నాడనీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS ఎందుకు పాల్గొనలేదో సమాధానం చెప్పాలని, కౌశిక్ రెడ్డికి సీజో ఫోర్నియా అనే వ్యాధి సోకిందని కౌశిక్ రెడ్డి విడియోలు చూసిన సైక్రియలజిస్ట్ డాక్టర్ చెప్పారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ప్రణవ్ అన్నారు. పట్టణం లో బుధవారం మధ్యాహ్నం సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజా పాలన జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రణవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి పై మండిపడ్డారు. కాళేశ్వరం లో అవినీతి జరిగిన విషయం BRS బిజెపి పార్టీలు ఒకటేనని సొంత చెల్లె కవిత చెప్పిందని అన్నారు.