కళ్యాణదుర్గం: కుందుర్పి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ వీఆర్వో నాగప్ప అనంతపురంలో చికిత్స పొందుతూ మృతి
కుందుర్పి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ నాగప్ప అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు నాగప్పను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగప్ప నాటక కళాకారుడి గా పేరుగాయించారు. 53 నాటకాలు ప్రదర్శించారు. నాగప్ప మృతి పట్ల గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.