కోడుమూరు: చనుగొండ్ల గ్రామంలో రైతన్నా మీకోసం, పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
గూడూరు మండలంలోని చనుగొండ్ల గ్రామంలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి పంచ సూత్రాలు అమలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సురేష్, అధికారులు పాల్గొన్నారు.