కుప్పం: స్కూల్కు వెళ్లడానికి రోడ్ వేయించరా : విద్యార్థులు
గుడుపల్లె మండలంలోని వెంగేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి రోడ్డు కోతకు గురైంది. రోడ్డు తెగిపోయి సుమారు నెల రోజులు కావస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నివసిస్తున్న అయిదు కుటుంబాల ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 'సార్.. మేము స్కూల్కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. దయచేసి రోడ్ వేయించండి' అంటూ పలువురు చిన్నారులు కోరుతున్న వీడియె వైరల్గా మారింది.