ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ గజానంద్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై పట్టణ వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయని, ఈ చెడు ప్రభావాలపై అవగాహన అవసరమని, మాదకద్రవ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ వ్యాపారస్తులు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.