అసిఫాబాద్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి
వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ASF అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శుక్రవారం ASF కలెక్టరేట్ అవరణంలో ఆర్డీఓ లోకేశ్వర్, మున్సిపల్ కమిషనర్ గాజానంద్ కలసి మొక్కలు నాటారు. ప్రతీఒక్కరు మొక్కలునాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.