ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం చట్టరీత్యా నేరమని మండల ప్రజలను ఎస్సై తీవ్రంగా హెచ్చరించారు.