కాంట్రాక్టర్ ఫణింద్ర చౌదరి అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా నిర్మాణం చేసిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కూలీలు ఆరోపించారు. సబ్ కాంట్రాక్టర్‌గా నిర్వహించిన రాజు నిర్మాణ కూలీలతో కలిసి అడ్విన్ కాలనీలోని సాయి నగర్ వెస్ట్ లో ఉంటున్న ఫణీంద్ర చౌదరి ఇంటి ముందు ధర్నాకు దిగారు. కోటి పైచిలుకు నిర్మాణ పనులను పూర్తిచేసుకుని డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.