అసిఫాబాద్: ఆసిఫాబాద్ బీసీ హాస్టల్ లో విద్యార్థుల అవస్థలు
ఆసిఫాబాద్ బీసీ వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం మంజూరు చేయాలని హాస్టల్ వార్డెన్ కృష్ణా ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం 7గంటలకు ఆయన మాట్లాడుతూ..బీసీ వసతి గృహంలో 60మంది విద్యార్థులు ఉంటున్నారని,ప్రస్తుతం మరమ్మత్తు చేసిన భవనంలో విద్యార్థులు ఉంటున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో వర్షపు నీరు గదిలోకి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇప్పటికైనా కొత్త భవనం మంజూరు అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.