నగరంలో సెలవు దినాల్లో క్లాస్ లు నడుపుతున్న కార్పొరేట్ కళాశాలపై చర్యలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
Eluru Urban, Eluru | Sep 21, 2025
ఏలూరులో ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహించడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు, విద్యార్థుల హక్కులను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో పీడీఎస్యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.