భువనగిరి: బీసీ రిజర్వేషన్ల కోసమే స్థానిక సంస్థలు ఆలస్యం:భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా:స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని మమ్మల్ని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు నిజం తెలియదా? అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు.గతంలో బిఆర్ ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 50% లోపు పరిమితం చేస్తూ తీర్మానం చేయడం వల్లే, నేడు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు పోరాడుతున్నా ఆలస్యం జరుగుతోందన్నారు.కేటీఆర్ కు ఈ వాస్తవం మీకు తెలిసినా, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. బీసీలకు న్యాయం చేయడమే మా లక్ష్యంగా ముందుకు పోతామన్నారు.