పట్టణంలో పలుచోట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
శ్రీకాళహస్తిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ నేతలు కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కోలా ఆనంట్తో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు. పీఎం జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2 వరకు వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.