నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయిస్తున్న ముగ్గురిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ గాంధీ నగర్లో తనిఖీలు చేపట్టి ధన్రాజ్ సింగ్, కర్ణ, మనోహర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ మాంజాను అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. నిందితుల వద్ద నుండి పెద్ద మొత్తంలో మాంజాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.