పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి నగదు అపహరణ, కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు
*ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి నగదు అపహరణ* ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ నందు ఒక మహిళ బ్యాగు నుండి 3,85,000 గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. సదరు ఫిర్యాదు పై శ్రీకాళహస్తి టూ టౌన్స్ ఎస్సై పార్థసారథి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ నందు గల సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మహిళ ఒక బాలుడి సహాయంతో దొంగతనం చేసినట్లు గుర్తించడం జరిగింది. సదరు మహిళ మరియు బాలుని గుర్తించిన ఎడల శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి 944090008 తెలియజేయవలసిందిగా కోరడమైనది.