రామగుండం: సింగరేణి కుట్రపూరితంగానే లాభాలు ప్రకటించడం లేదు : AITUC నేత వాసిరెడ్డి సీతారామయ్య
కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 19వ తేదీన ధర్నాలను చేయడం జరుగుతుందని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు మంగళవారం వారు 11వ సింగరేణి గనిలో ఏర్పాటుచేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి కుట్ర పూరితంగానే యాజమాన్యం లాభాలు ప్రకటించడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో ఏ ఐ టియు సి నాయకులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.