రాణి నగర్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ ఓ మహిళకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
అనంతపురం నగరంలోని రాణి నగర్ లో సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో రెండు కుటుంబాలు గొడవ పడుతుండడంతో సద్ది చెప్పడానికి వెళ్లిన సాయి పద్మ అనే మహిళపై ఆ రెండు కుటుంబాలు దాడి చేశారు. సాయి పద్మకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి పద్మకు తలకు, కంటికి తీవ్ర గాయాలయ్యాయని అత్యవసర విభాగం వైద్యురాలు డాక్టర్ సౌమ్య తెలిపారు.