పత్తికొండ: క్రిష్ణగిరి మండలంలో గోకులపాడు రైతులు వెళ్లే రహదారి వంతెన ఏర్పాటు చేయాలి #localissue
క్రిష్ణగిరి మండలం గోకులపాడు రైతులు కష్టపడి పండించిన పంటను తీసుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి లేక వాగులోనే ఎద్దుల బండి మీద రవాణా చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత కష్టంగా ఉంటోందని మంగళవారం వాపోయారు. గతంలో రూ.7 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరైనా.. తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు.