భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాం
- నాయుడుపేట తహసిల్దార్ మాగర్ల రాజేంద్ర
అల్పపీడ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తహసిల్దార్ మాగర్ల రాజేంద్ర తెలిపారు. బుధవారం ఆయన తహసిల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు కలిగిన కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తెలియజేస్తే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.