పెద్దమందడి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వనపర్తి జిల్లా కలెక్టర్
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామ శివారు లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కేంద్రం ఇంచార్జి కి సూచించారు. రైతులకు ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని సూచించారు. కొనుగోలు అనంతరం 24 గంటల్లో ట్యాబు ఎంట్రీ చేసి సకాలంలో రైతులకు నగదు అందేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు