ఉప్పల్ డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పనులను కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం రజిత పరమేశ్వర్ రెడ్డి రామంతపూర్ శ్రీరామనాపురం లో విస్తృతంగా పర్యటించారు. శ్రీరామనపురం కాలనీలో 98 లక్షలతో జరుగుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ అభివృద్ధి పనులను డిఇ వెన్నెల గౌడ్, ఏఈ రాజ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రామంతపూర్ శ్రీ రమణపురం చర్చి కాలనీలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త స్టాంప్ వాటర్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తొందర్లోనే సిసి రోడ్లు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.