రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి
- సూళ్లూరుపేట - పోలిరెడ్డి పాలెం మధ్య ప్రమాదం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట - పోలిరెడ్డి పాలెం రైల్వే స్టేషన్ ఎగువ దిగువ రైలు మార్గం మధ్యలో గుర్తుతెలియని మగ మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఈ మేరకు సమాచారాన్ని రైల్వే పోలీసులకు అక్కడివారు అందజేశారు. సమాచారం అందుకున్న సులూరుపేట జి ఆర్ పి ఓ పి ఎస్సై చెన్నకేశవ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి రైలు నుండి ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట వైద్యశాలకు తరలించారు. అయితే మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో మృతున్ని గుర్తించిన వారు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన