కనిగిరి: వేములపాడులో ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ప్రచార జాత
హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు లో ఈనెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలని సిఐటియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ప్రచార జాత కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే సార్వత్రిక సమ్మె జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.