అల్లూరి ఏజెన్సీలో నేటి నుండి మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
నేటి నుండి అక్టోబర్ 02 వరకు అల్లూరి ఏజెన్సీలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమము ద్వారా 14 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మహిళలకు ఉచిత అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పాడేరు గుడివాడ వద్ద ఉన్న అంగన్వాడి సెంటర్ లో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తమర్బ విశ్వేశ్వర నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం తో పాటు టీబివిముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గిరిజన మారుమూల గ్రామాల్లో సైతం మహిళలు అందరికీ ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.