దొరవారి సత్రం రైల్వే స్టేషన్లో ఆగిన పినాకిని ఎక్స్ప్రెస్
- బ్రిడ్జి మరమత్తుల కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
తిరుపతి జిల్లా నాయుడుపేట - సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల మధ్యలో పినాకిని ఎక్స్ప్రెస్ రైలును తాత్కాలికంగా మంగళవారం ఆపేశారు. సూళ్లూరుపేట తడ మధ్యన పాముల కాలవ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సిన కారణంగా దొరవారిసత్రం రైల్వే స్టేషన్లో పినాకిని ఎక్స్ప్రెస్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు నాయుడుపేట స్టేషన్ మేనేజర్ చిరంజీవి తెలియజేశారు. బ్రిడ్జి మరమతుల కారణంగా ప్రస్తుతం ఆ మార్గంలో ఒకే లైన్లో రైళ్ల రాకపోకలు సాగుతున్నాయన్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇదిలా ఉంటే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు దొరవారి సత్రం రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయడం