సిర్పూర్ టి: ఆచెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరుల అనుమానాస్పద మృతి, భీమన్న దేవర అటవీ ప్రాంతంలో మృతదేహాల లభ్యం
సిర్పూర్ టి మండలం అచ్చెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు దూలం శేఖర్ సుశీల దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ దంపతులకు మృతదేహాలను భీమన్నదేవర అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. పశువుల కాపరుల మృతి ఏదైనా ప్రమాదమా, ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు,