కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి : రంపచోడవరం ITDA PO స్మరణ రాజ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు నిబంధన ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన సెక్టార్ అధికారులతో మంజూరైన పనులు సకాలంలో పూర్తిచేసే విధంగా ప్రాజెక్టు అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజ్ మాట్లాడుతూ పీఎం జన్మన్, డి ఏ జూ గా పథకాలు ద్వారా ఒక్కొక్క శాఖలో ఎన్ని పనులు మంజురవినవి ఎన్ని పనులు పూర్తి చేసినవి అడిగి తెలుసుకున్నారు.