గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జిల్లాలోని పెద్ద చెర్లోపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెస్ఎంఈ పార్కులు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా వచ్చారు. సీఎం చంద్రబాబుకు పుష్పం అందించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత నియోజకవర్గ పరిస్థితులను ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకుని తర్వాత కార్యక్రమంలో పాల్గొనేందుకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.