దర్శి: కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో కార్తీక సోమవారం సందర్భంగా శివాలయంలో భక్తులతో కిటకిటలాడింది. ముందుగా స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.