ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ రాజబాబును కలిసి చర్చించారు. ఆర్టీసీ డిపోకు అవసరమైన స్థలం మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ సిబ్బందితో డిపో కు అనువుగా ఉండే ప్రభుత్వ స్థలాన్ని అన్వేషిస్తామని హామీ ఇచ్చినట్ల ఆమె తెలిపారు. సీఎం దర్శి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు నిధులు మంజూరు పనుల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ తో చర్చించామన్నారు.