అధికారులు బాగా పనిచేశారు: శ్రీకాళహస్తి MLA శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికంగా వర్షాలు కురిశాయని.. అధికారులు చాలా బాగా పనిచేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కొనియాడారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్వాసితులకు 25 కేజీల బియ్యం, రూ.3 వేలు అందజేస్తుందన్నారు. తాను పలు గ్రామాలను పరిశీలించి 10 కేజీల బియ్యాన్ని అందజేశానని తెలిపారు.