ప్రకాశం జిల్లా కొండపిలో వచ్చే ఏడాదికి స్థలం సేకరించి స్టేడియం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర మారి టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య అన్నారు. కొండపిలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన సత్య మాట్లాడారు. కొండపిలో క్రీడలను ప్రోత్సహించే విధంగా తమ వంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను కొండపిలో ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్న యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.