జెడ్.రాగంపేట ఆసుపత్రి వద్ద అక్రమ కట్టడాల పై బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జ్ జుత్తుక నాగేశ్వరరావు ఆగ్రహం
గండేపల్లి మండలం జెడ్.రాగంపేటలో నూతనంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో అక్రమ నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం 4 5 మండిపడ్డారు.ఆసుపత్రి ఆవరణంలో ప్రైవేట్ వ్యక్తులు షాపు నిర్మాణం చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.అంతేకాకుండా అధికారులు స్పందించి అక్రమ కట్టడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.