మెదక్: భయపడుతూ బతుకమ్మలను నిమజ్జనం చేసిన మహిళలు
Medak, Medak | Sep 21, 2025 రామాయంపేట మండల కేంద్రంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మల్లెచెరువు వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు భయపడుతూ బతుకమ్మలను నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఒక్క వీధిలైట్లు కూడా లేకపోవడం వల్ల పిల్లాపాపలతో వచ్చిన మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ మల్లెచెరువు వద్ద నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి నెలకొందని, ఒక వీధి లైట్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జనం చేసే చోట ఒక గజ ఈతగాళ్లు కానీ, మున్సిపల్ సిబ్బంది కూడా లేరన్నారు