హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఈ నెల 19న ఆరుకు లో మహాధర్న విజయవంతం కోసం ప్రచారం
అల్లూరి ఏజెన్సీలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్మించ తలపెట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న అరకులో నిర్వహించే మహా ధర్నా విజయవంతం చేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బస్సుకి గ్రామానికి చేరుకుని హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా నిర్వహించే ధర్నాలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుందామని ఆ కమిటీ నేత బస్కీ సర్పంచ్ పాడి నరేష్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.