అమీనాబాద్ గ్రామానికి చెందిన ప్రజలు డ్రైనేజీ పనులు చేయాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎండి పేట వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షం నీరు డ్రైనేజీ లేక బయటికి వెళ్ళకపోవడంతో దోమలు పాములు విష కీటకాలు వస్తున్నాయని చిన్న పిల్లలతో ఇక్కడ నివసిస్తున్నామని పంచాయతీ అధికారులు డ్రైనేజీకి వేయడానికి నిధులు మంజూరు చేస్తే కొంతమంది డ్రైనేజ్ వేయడానికి వీలులేదని ఆపుతున్నారని ఆరోపించారు . ఈ సమస్యపై గురువారం ఉదయం 11 గంటలకు మండల అభివృద్ధి అధికారి కి సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు.