పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులు పూజలు
మహాలయ అమావాస్య సందర్భంగా పితృ తర్పణాలు ఇచ్చేందుకు కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. పితృపక్షాల చివరి రోజు, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అడుగు పెట్టడానికి కూడా స్థలం లేనంతగా భక్తులు కిక్కిరిసిపోయారు. దేవదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, స్నానాల వద్ద ఇబ్బందులు పడుతున్నామని భక్తులు తెలిపారు.