రామన్నపేట: సీపీఎం ఆధ్వర్యంలో రామన్నపేట ప్రభుత్వాసుపత్రి పరిశీలన, హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరిందని వెల్లడి
రామన్నపేట మండలం పరిసర ప్రాంతాల్లో వేలాది మందికి 50 ఏండ్ల నుండి వైద్య సౌకర్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రభుత్వ యంత్రాంగం, వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల నాయకత్వంతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలన చేసి, సర్వే నిర్వహించి ,రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.