పాణ్యం: నన్నూరులో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
ఓర్వకల్లు మండలం నన్నూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం స్థానికుల సమాచారం మేరకు ఆర్టీసీ బస్సు ఓవర్ క్రాస్ చేస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పింది. అయితే, అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడినప్పటికీ, అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.