ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేందుకు ప్రయత్నిస్తున్న వారిని నిరోధించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు డ్రోన్ ఎగరవేశారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న ఇద్దరు వ్యక్తులు డ్రోన్ చూసి పరుగులు పెట్టారు. మందుబాబులు పరుగు పెడుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి.