పలమనేరు: రూరల్ మండలం నక్కపల్లి గ్రామ స్థానికులు ఆదివారం మీడియా తెలిపిన సమాచారం మేరకు. మొరం గ్రామానికి చెందిన జై చంద్ర అనే ద్విచక్ర వాహనదారుడు నక్కపల్లి కోళ్ల ఫారాల వద్ద పలమనేరు - కుప్పం రహదారిపై సిమెంటు రాళ్ల లోడ్డుతో ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు, దీంతో జై చంద్ర తీవ్ర రక్త గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించి పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ప్రమాదం జరగడానికి కారణం ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తిదా లేదా ద్విచక్ర వాహనదారుడిదా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సిఉంది.