పూలకుంట్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో పుట్టపర్తి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు నష్టం చేకూరుస్తుందని అన్నారు. అనంతరం ప్రజల నుంచి సంతకాలు సేకరించి, గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.