కుప్పం: కార్తీక మాసం మొదలైన సందర్భంగా కాణిపాకం మణికంఠేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆకాశదీపం
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు బుధవారం కార్తీక మాసం ప్రారంభం కావడంతో సాయంత్రం మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు గల రాతి దీప స్తంభం నకు వైభవంగా *ఆకాశ దీపం* వెలిగించి ప్రత్యేక పూజలు చేసి పైకి లాగడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.