మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి అందరూ రుణపడి ఉంటారని ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు అన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మార్కాపురం జిల్లా ఒకటే మార్గమని పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన గత ప్రభుత్వం తలుచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు.