విశాఖపట్నం: రానున్న 2 రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి: తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారిని తారా స్వరూప
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారిని తారా స్వరూప తెలిపారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు రోజులు పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు అవుతాయని ఆమె తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని మత్స్యకారుల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలకు అలర్ట్ లు జారీ చేశామని ఆమె తెలిపారు.