యర్రగొండపాలెం: ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జర్నలిస్టులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులు సంపాదకులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జర్నలిస్టులు చేతులకు సంకెళ్లు వేసుకొని మరియు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన తెలిపారు. తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టుల హక్కులను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని జర్నలిస్టుల అన్నారు. పత్రికా స్వేచ్ఛకు అడ్డు పడకుండా అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు.